[ad_1]
Business Idea
అత్యంత విలువైన ఆస్తుల్లో భూమి ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రోజురోజుకీ మనుషుల జనాభా పెరుగుతుంది కానీ, పెరగనిది స్థలం ఒక్కటే. అందుకే భూమికి విలువ అనేది పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. అందుకే భూమిపై పెట్టుబడి పెట్టిన వారు నష్టపోయిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటుంది.
కేవలం భూమి మాత్రమే కాకుండా బిల్డింగ్‌పై ఖాళీగా ఉండే బాల్కనీని సైతం మంచి ఆదాయ వనరుగా మార్చుకోవచ్చని మీకు తెలుసా.? అవును మీ బిల్డింగ్‌పై ఉన్న ఖాళీ స్థలంతో నెలకు ఏకంగా రూ. లక్ష వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. ఎలాంటి పెట్టుబడి లేకుండా మంచి సంపాదన పొందే మంచి బిజినెస్ ఐడియా ఒకటి ఉంది. ఇందుకోసం మనం ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం మేడపై ఖాళీ స్థలాన్ని రెంట్‌కి ఇచ్చుకుంటే చాలు. ఇంతకీ ఏంటీ బిజినెస్ ఐడియా.? దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
బిల్డింగ్‌పై ఉన్న ఖాళీ స్థలాన్ని మొబైల్ టవర్‌ను ఇన్‌స్టాల్ చేయడం మంచి ఆదాయ వనరుగా చెప్పొచ్చు. మీ బిల్డింగ్‌పై ఉన్న ఖాళీ స్థలం ఆధారంగా టవర్ ఇన్‌స్టాల్ కోసం నేరుగా మొబైల్ టవర్ ఇన్‌స్టాలేషన్ కంపెనీలను సంప్రదించవచ్చు. దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లోనూ సమాచారం లభిస్తుంది. అయితే ఆన్‌లైన్‌లో లభించే సమాచారనంతా గుడ్డిగా నమ్మే పరిస్థితి ఉండదు కాబట్టి, నేరుగా మొబైల్ నెట్‌వర్క్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడడం ఉత్తమం.
ఇక భూఇమపై మొబైల్ టవర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి కనీసం 2000 చదరపు అడుగుల భూమి అవసరం ఉంటుంది. అదే ఒకవైళ బిల్డింపై అయితే మొబైల్ టవర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి 500 చదరపు అడుగుల స్థలం ఉంటే సరిపోతుంది. సాధారణంగా బిల్డింగ్స్‌పై ఏర్పాటు చేసే టవర్స్ తక్కువ రేడియోస్‌లో సిగ్నల్‌ను అందించేందుకు ఏర్పాటు చేస్తారు. అందుకే వీటిని తక్కువ స్థలంలో ఏర్పాటు చేస్తారు. మీ ఇంటికి స్ట్రక్చరల్ సేఫ్టీ సర్టిఫికేట్ ఉంటే మొబైల్ టవర్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే మొబైల్ టవర్స్ ఆసుపత్రులకు 100 మీటర్ల దూరంలో ఉండకూదనే నిబంధన ఉంది.
టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు దేశంలోని ప్రతీ ప్రాంతంలో తమ సేవలను విస్తరించేందుకు ఆసక్తిగా ఉన్నారు. మొబైల్ టవర్ ఇన్‌స్టాలేషన్ సేవలను అందించేది వీరే. మొబైల్ టవర్ ఇన్‌స్టాలేషన్ కోసం మీ ఇంటిని అద్దెకు ఇవ్వడానికి నేరుగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను సంప్రదించాల్సి ఉంటుంది. మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL), టాటా కమ్యూనికేషన్స్, GTL ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ టవర్స్, అమెరికన్ టవర్ కో ఇండియా లిమిటెడ్, HFCL కనెక్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి కంపెనీలు మొబైల్ టవర్స్‌ను ఏర్పాటు చేస్తాయి.
ఇక మొబైల్ టవర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి ఎలాంటి ఖర్చు అవసరం లేదు. రిటర్న్‌లో టెలికాం కంపెనీలు మీకు అద్దెను చెల్లిస్తాయి. మీ బిల్డింగ్‌పై ఉండే స్థలం, సదరు ప్రాంతానికి ఉన్న డిమాండ్ ఆధారంగా అద్దె చెల్లిస్తారు. గ్రామీణ ప్రాంతం, సెమీ రూరల్, అర్బన్ లొకేషన్ ఆధారంగా టెలికం కంపెనీలు అద్దెను ఇస్తాయి. మొబైల్ టవర్ ఏర్పాటు ద్వారా కనీసం నెలకు రూ. 10,000 నుంచి గరిష్టంగా రూ. 1 లక్ష వరకు ఆదాయం పొందొచ్చు.
మరిన్ని జిబినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.
[ad_2]
Source link