Business Ideas: బెస్ట్ బిజినెస్ ఐడియాలు ఇవే.. రూ.10 వేల పెట్టుబడి చాలు.. భారీగా ఆదాయం!

[ad_1]

Business Ideas: ప్రస్తుతం రోజుల్లో ఖర్చులు ఏ విధంగా పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెల నెలా జీతం వచ్చే వారు సైతం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి. మనకు డబ్బు అనేది చాలా ముఖ్యమైన ఇంధనం. బతుకు బండి నడవాలంటే డబ్బు అనే ఇధనం కావాల్సిందే. డబ్బులు లేకుంటే బతుకు బండి ముందుకు సాగదు. డబ్బుల కోసం కొందరు ఉద్యోగాలు చేస్తారు, ఇంకొందరు కూలీ పనులు చేస్తారు. ఇలా వారి వచ్చిన పని చేస్తుంటారు. కొందరు వ్యాపారం చేస్తారు. సొంత వ్యాపారం అంటే తమ కాళ్లపై తాము నిలబడొచ్చని అంతా భావిస్తారు. అలాగే ఇటీవలి కాలంలో రెండో ఆదాయం కోసం చాలా మంది చిన్న చిన్న బిజినెస్ లు ప్రారంభిస్తున్నారు. అయితే, చాలా మందికి ఏ బిజినెస్ చేయాలో తెలియక ఇబ్బందులు పడుతారు. కొందరు కనిపించిన దాంట్లో డబ్బులు పెట్టి నష్టపోతుంటారు. అందుకే ఏ బిజినెస్ ప్రారంభించినా ముందుగా అన్ని వి,యాలు తెలుసుకోవాలి. ముందు పెట్టుబడి సమకూర్చుకోవాలి. తక్కువ పెట్టుబడితో రిస్క్ తక్కువగా ఉండే వాటిని ఎంచుకుంటే మేలు. అలా మీరు కేవలం రూ. 10 వేల పెట్టుబడితో బిజినెస్ చేసే కొన్ని అవకాశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బ్లాగింగ్

ఈ రోజుల్లో బ్లాగింగ్ అనేది చాలా మందికి ఒక మంచి అవకాశంగా మారిందని చెప్పవచ్చు. బ్లాగింగ్ ప్రారంభించడానికి ఎక్కువ పెట్టుబడి సైతం అవసరం లేదు. పెద్ద బ్రాండ్‌లు, కంపెనీలు కూడా తమ వెబ్ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌ల కోసం ఆసక్తికరమైన వీడియోలు, పోస్ట్‌లను క్యూరేట్ చేయగల బ్లాగర్‌లను నియమించుకుంటున్నాయి. వారి కంటెంట్ సహాయంతో ప్రపంచ ప్రేక్షకులను చేరుకోవడం వారికి సులభం అవుతుంది.

how-to-become-online-fitness-trainer-71936470

ఊరగాయ బిజినెస్

రూ. 10 వేల పెట్టుబడితో తమ స్టార్టప్‌ని ప్రారంభించాలనుకునే వారు ఊరగాయ బిజినెస్ ఎంచుకోవచ్చు. మన దేశంలో భోజనంలో కచ్చితంగా పచ్చడి ఉండాల్సిందే. పలు రకాల పచ్చళ్లు, చట్నీలు చేస్తుంటారు. చాలా మంది ఊరగాయను తినడానికి ఇష్టపడతారు. అయితే మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావాల్సిందల్లా తాజా ముడి సరుకు మాత్రమే. అలాగే మంచి అనుభవం ఉన్న వారితో ఈ పచ్చడి పెట్టిస్తే సరిపోతుంది. అలాగే కొన్ని ప్యాకేజింగ్ మెటీరియల్. వ్యాపారాన్ని విస్తరించేందుకు మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ ప్లాన్ చేయాలి.

టిఫిన్ సర్వీస్

రూ.10 వేల లోపు వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి టిఫిన్ సర్వీసెస్ ఉత్తమ ఎంపికగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహిళలకు. ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగాలు చేస్తూ ఎక్కువ సమయం ఆఫీసుల్లోనే గడుపుతున్నారు. వంట చేసుకునేందుకు తగినంత సమయం లేకపోవడంతో టిఫిన్ సర్వీసెస్ కోసం చూస్తారు. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడానికి మంచి మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇంటి నుంచి కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

యోగా తరగతులు

యోగా తరగతులు కూడా మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఈ ఉరుకులు పరుగుల జీవితంలోప్రజలకు తగినంత సమయం లేదు. ఆరోగ్యంగా ఉండటానికి మార్గాలను అన్వేషిస్తూనే ఉంటారు. యోగా శిక్షణ మీకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. ప్రజలలో యోగాకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఇంట్లో లేదా కమ్యూనిటీ సెంటర్‌లో యోగా నేర్పడానికి తమ సొంత వెంచర్‌ను ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారానికి రూ. 10,000 కంటే తక్కువ పెట్టుబడి సరిపోతుంది.

బండ తిరుపతి గురించి

బండ తిరుపతి డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్

బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.Read More

[ad_2]

Source link