Business Ideas: తులసికి భారీగా డిమాండ్.. రైతులు లక్షాధికారులవడం పక్కా..!

[ad_1]

రైతులు ఎప్పుడూ వేసే పంటలు కాకుండా.. కాస్త కొత్తగా ప్రయత్నిస్తే.. అధిక లాభాలు గడించవచ్చు. వాణిజ్య పంటతో అధిక ఆదాయం పొందవచ్చు. అలాంటి ఐడియానే ఒకటి చెప్పబోతున్నాం. అదే ఔషధ మొక్కల పెంపకం (Medicinal Plants Farming). ప్రస్తుతం ఎన్నో ఆయుర్వేద మందులు, అల్లోపతి మందుల తయారీలోనూ ఔషధ మొక్కలను వాడుతున్నారు. ఆ పంటలను పండిస్తే భారీగా ఆదాయం వస్తుంది. మార్కెటింగ్ ఇబ్బందులు కూడా ఉండవు. మరి ఆ పంట ఏంటి? మార్కెటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం.

మీకు పొలం ఉండి.. వ్యాపారం చేయాలని ఆసక్తి ఉంటే ఔషధ మొక్కల పెంపకం వైపు అడుగులు వేయవచ్చు. ఔషధ మొక్కల ఎకరాలకు ఎకరాల స్థలం.. భారీగా పెట్టుబడి అవసరం లేదు. పలు ఔషధ కంపెనీలతో ఒప్పందం చేసుకొని ఔషధ మొక్కలను పండించాలి. మన దేశంలో సహజ ఉత్పత్తులు, ఔషధాల మార్కెట్ చాలా పెద్దది. అందులో ఉపయోగించే సహజ ఉత్పత్తులకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. అన్ని కాలాల్లోనూ ప్రజలకు వీటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం చాలా కంపెనీలు కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఔషధ మొక్కలను సాగు చేస్తున్నాయి. వాటి సాగు ప్రారంభించడానికి కొన్ని వేల రూపాయలు పెట్టుబడిగా పెడితే చాలు.. ఆదాయం లక్షల్లో ఉంటుంది.

తులసి (Tualsi), ఆర్టెమిసియా అన్నూ, లికోరైస్, అలోవెరా.. ఈ మొక్కలను చాలా రకాలల ఔషధాల్లో వాడుతున్నారు. ఈ మొక్కలను పెంచితే మంచి ఆదాయం వస్తుంది. తక్కువ సమయంలోనే పంట కూడా చేతికి వస్తుంది. వీటిని పంటల పొలాల్లోనే పెంచాల్సిన అవసరం లేదు. మీ వద్ద ఖాళీ స్థలం ఏదైనా ఉంటే.. అక్కడ చిన్న కుండీలలో కూడా పెంచుకోవచ్చు. ఈ రోజుల్లో ఔషధ మొక్కల కొనుగోలు కోసం రైతులతో ఒప్పందాలు చేసుకునే ఫార్మాస్యూటికల్ కంపెనీలు చాలానే ఉన్నాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు రైతులకు ఈ అవకాశం కల్పిస్తున్నాయి. ఆదాయం పట్ల కూడా హామీ ఇస్తున్నాయి.

చికెన్ కబాబ్ చాలా టేస్ట్ గురు.. ఈ వ్యాపారంతో ప్రతి నెలా రూ.వేలల్లో లాభం

తులసిమొక్క (Basil Plant)ను హిందువులు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తున్నారు. మహిళల ఉదయాన్నే తలస్నానం చేసి తులసి కోటకు పూజ చేస్తారు. అంతేకాదు ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వీటిలో యూజినాల్ మరియు మిథైల్ సిన్నమేట్ ఉంటాయి. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు మందులు తయారు చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. అందు వల్ల తులసి మొక్కలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. 1 హెక్టారులో తులసి పండించడానికి కేవలం 15 వేల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అయితే 3 నెలల తర్వాత ఈ పంటను సుమారు 3 లక్షల రూపాయలకు అమ్ముకోవచ్చు.

పతంజలి, డాబర్, వైద్యనాథ్..వంటి ఆయుర్వేద ఔషధాలను తయారు చేసే కంపెనీలతో కలిసి ఒప్పంద వ్యవసాయం చేయవచ్చు. ఆ కంపెనీ వారే విత్తనాలు సరఫరా చేస్తారు. రైతులకు సాగు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. మళ్లీ వారే వచ్చి పంటను తీసుకెళ్తారు. తద్వారా రైతులకు మార్కెటింగ్ రిస్క్ ఉండదు. తులసి గింజలు మరియు నూనెకు కూడా పెద్ద మార్కెట్ ఉంది. మార్కెటింగ్ పట్ల అవగాహన ఉన్న వారు సొంతంగా కూడా కంపెనీలకు విక్రయించవచ్చు.

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.

[ad_2]

Source link