[ad_1]
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ‘తాము జాబు కోల్పోతామనే’ ఆందోళన భారతీయుల్లో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకి భారత్లో ఏఐతో ఏయే రంగాల ఉద్యోగులు ప్రభావితం కానున్నారు?
ప్రముఖ స్టాఫింగ్ సంస్థ రాండ్స్టాడ్ పలు దేశాల్లో వార్షిక సర్వే నిర్వహించింది. ఆ సర్వేల్లో అమెరికా, యూకే, జర్మనీ వంటి దేశాలతో పోలిస్తే.. ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు ఏఐ కారణంగా ఉద్యోగం పోతుందేమోనన్న భయం వ్యక్తం చేసినట్లు తెలిపింది.
ముఖ్యంగా, మనుషుల స్థానంలో ఏఐ ఆటోమెషిన్ను వినియోగించే రంగాలైన బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్ సోర్సింగ్ (బీపీవో), నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ (కేపీవో) సెక్టార్లలో పనిచేసే సిబ్బంది ఎక్కువమంది ఉన్నట్లు రాండ్స్టాడ్ నివేదిక హైలెట్ చేసింది.
ఈ సందర్భంగా రాండ్స్టాడ్ ఇండియా సీఈవో విశ్వనాథ్ మాట్లాడుతూ..‘కేపీవో, బీపీవో విభాగాల్లో భారతీయులు ఎక్కువ మంది పనిచేస్తున్నారు. ఆ రంగాల్ని ఏఐ భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా, కృత్తిమ మేధను వినియోగించే దేశాల్లో భారత్ వేగంగా ఉంది. కాబట్టి పైన పేర్కొన్న రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఏఐ టెక్నాలజీపై దృష్టిసారించాలని’ సూచించారు.
మరిన్ని వార్తలు :
Tags
గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అందుకున్న నీతాఅంబానీ
జియో గుడ్న్యూస్.. ఆ కస్టమర్లే టార్గెట్!
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
రషీద్ ఖాన్కు రతన్ టాటా రూ.10 కోట్లు రివార్డు ఇచ్చారా?
ఆయనైతే 90 గంటలు పనిచేసేవారు.. భర్తకు అండగా సుధామూర్తి
[ad_2]
Source link