[ad_1]
దీపావళి పండగ సమీపిస్తోంది. అంగరంగ వైభవంగా ఈ పర్వదినం జరుపుకోవడానికి ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీపావళికి చాలా మంది తమ సన్నిహితులకు బహుమతులు ఇస్తుంటారు. ఇళ్లను విద్యుత్ కాంతులతో, దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తుంటారు. పండుగ ఏర్పాట్ల కోసం ప్రజలు భారీగా ఖర్చు చేస్తుంటారు. దీంతో మార్కెట్లో కొన్ని రకాల వస్తువులకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. అందుకే దీపావళికి కొన్ని రకాల వ్యాపారాలు మంచి లాభాలను అందిస్తాయి. మీరు కూడా ఈ పండుగ సీజన్లో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే.. అందుకు బెస్ట్ ఆప్షన్స్ ఏవో చూద్దాం.
మట్టి, ఎలక్ట్రానిక్ దివ్వెలు
దీపావళి అంటేనే వెలుగుల పండగ. దీపాలతో ఇళ్లను అలంకరిస్తారు. అందుకే ఈ పండగ సమయంలో దివ్వెలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. అందుకే మట్టి ప్రమిదల వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. లేదా తయారీదారుల నుంచి వీటిని కొని అమ్మవచ్చు. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ దీపాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. లెటెస్ట్‌గా డిజైనర్ ల్యాంప్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. దీపావళికి వీటిని అమ్మి, మంచి ఆదాయం పొందవచ్చు.
సంబంధిత వార్తలు
ఎల్ఈడీ లైట్ల అమ్మకం
ప్రస్తుతం దీపావళి ట్రెండ్ మారుతోంది. మొన్నటివరకు మట్టి దివ్వెలతో ఇంట్లో దీపాలను వెలిగించేవారు. ఇప్పుడు వాటి స్థానాన్ని ఎల్ఈడీ లైట్లు ఆక్రమిస్తున్నాయి. ఎల్ఈడీ లైట్లు తక్కువ విద్యుత్‌ను వినియోగించుకోవడంతో పాటు షాక్ నిరోధకతను కలిగి ఉంటాయి. పైగా ఇళ్లు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఈ లైట్లు తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. ఈ దీపావళికి వాటిని విక్రయించి చక్కగా లాభపడవచ్చు. ఎల్ఈడీ లైట్ క్యాండిల్స్, ఎల్ఈడీ స్ట్రిప్ లైట్లు, ఎల్ఈడీ దియా స్ట్రింగ్స్, ఎల్ఈడీ విగ్రహం స్పాట్లైట్లు, ఎల్ఈడీ ఓం లైట్లు వంటి వాటిని విక్రయించవచ్చు.
Also Read: మార్కెట్ లోకి ఎగిరే కారు.. ఎంచక్కా గాల్లో ఎగురుతూ జర్నీ ఎంజాయ్ చేసేయండి..!
కొవ్వొత్తుల అమ్మకం
దీపావళికి కొందరు తమ ఇళ్లలో కొవ్వొత్తులు వెలిగిస్తుంటారు. ఈ కాంతి మనలోని అజ్ఞానాన్ని తొలగించి, సరైన జ్ఞానాన్ని ప్రసాదించే సూచిక లాంటిది. దీపావళికి ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసే కొవ్వొత్తుల వ్యాపారం ప్రారంభిస్తే, మంచి లాభాలు పొందవచ్చు. పెట్టుబడి కూడా తక్కువగా ఉండటం కలిసొచ్చే అంశం. తేలియాడే కొవ్వొత్తులు, అలంకార కొవ్వొత్తులు, సువాసన అందించే కొవ్వొత్తులు.. ఇలా రకరకాల ప్రొడక్టులను కస్టమర్లకు అందించవచ్చు.
డిజైనర్ ప్రొడక్ట్స్
దీపావళికి ఇళ్లు, ఆఫీస్‌లు, దుకాణాలను మిరుమిట్లుగొలిపే లైట్లు, రంగులతో అలంకరించడం సహజం. ఈ అవసరాన్ని మీరు బిజినెస్‌గా మల్చుకోవచ్చు. స్ట్రింగ్ లైట్లు, బ్లింకింగ్ లైట్లు, ఫెయిరీ లైట్లు, టీ లైట్ హోల్డర్లు, పేపర్ లాంతర్లు, డిస్కో లైట్స్ వంటి డెకరేట్ లైట్ల బిజినెస్‌ను ప్రారంభించవచ్చు. ఈ లైట్లను హోల్‌సేల్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి, రిటైల్‌గా అమ్ముతూ లాభాలు పొందవచ్చు.
అగ్ర వీడియోలు
-
November 10, 2023, 4:41 pm IST
టపాసులు కాల్చే సమయంలో.. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి… లేదంటే..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..
- First Published :
[ad_2]
Source link