[ad_1]
భారతదేశంలో పండుగల హడావుడి మొదలైపోయింది. అందరూ వేడుకలు జరుపుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దసరా, దీపావళి పండుగలు సంప్రదాయాలను, సంతోషాలను మాత్రమే కాదు.. దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తులకు ఆర్థిక అవకాశాలను కూడా అందజేస్తాయి. ఈ పండుగలు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయి. ఈ సమయంలో మంచి లాభాలను తీసుకొచ్చే 10 బెస్ట్ బిజినెస్ ఐడియాల గురించి తెలుసుకుందాం.
* టీ/కాఫీ స్టాల్
పండుగల సమయంలో టీ, కాఫీ వంటి పానీయాలకు డిమాండ్ ఉంటుంది. పూజ పాండల్స్, ఇతర రద్దీ ప్రాంతాల్లో టీ లేదా కాఫీ స్టాల్ ఏర్పాటు చేసి మంచి లాభాలను పొందవచ్చు.
* విగ్రహాల దుకాణం
దసరా, దీపావళి సందర్భంగా ప్రజలు పూజల కోసం దేవతా మూర్తుల విగ్రహాలను కొనుగోలు చేస్తారు. అందుకే ఈ పండుగల సమయంలో విగ్రహాల తయారీ, విక్రయ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
* స్వీట్స్ షాప్
స్వీట్లు లేకుండా దసరా, దీపావళి, దుర్గాపూజ పూర్తి కాదు. అందుకే ఈ సీజన్‌లో బిజీ స్ట్రీట్స్‌లో మిఠాయిలు తయారు చేయడం, విక్రయించడం ప్రారంభించండి. లడ్డూలు, జిలేబీలు, రసగుల్లాలు, గులాబ్ జామూన్‌లు వంటి ట్రీట్‌లను ఆఫర్ చేయండి. వీటి ధర కేజీ రూ.200 నుంచి రూ.1,000 మధ్య ఉంటుంది, పండుగ సీజన్‌లో గణనీయమైన లాభాలను అందిస్తుంది.
* గృహాలంకరణ
పండుగ సమయంలో గృహాలంకరణకు చాలా డిమాండ్ ఉంటుంది. అందుకే ఇళ్లు, బాల్కనీలు, ప్రాంగణాలను అలంకరించేందుకు రంగురంగుల లైట్లు, గోడ గడియారాలు, ఫోటో ఫ్రేమ్‌లు, క్యాండిల్ స్టాండ్‌లు, షోపీస్‌లు, ల్యాంప్‌షేడ్‌లు విక్రయించవచ్చు.
* మెహందీ/టాటూ షాప్
మెహందీ ఆర్ట్ అనేది వేడుక, అందానికి చిహ్నం. మెహందీ డిజైన్ దుకాణాన్ని ఓపెన్ చేయడం ద్వారా పండుగకు వెళ్లేవారిని, ముఖ్యంగా మహిళలను ఆకర్షించవచ్చు. తాత్కాలిక టాటూలు లేదా స్టిక్కర్ టాటూ సేవలను కూడా అందించవచ్చు.
* ఫుడ్ స్టాల్స్
సాంప్రదాయ వంటకాల పట్ల ఉన్న ప్రేమ ఈ పండుగలలో అంతర్భాగం. ఆలయాలు, ఇతర రద్దీ ప్రాంతాల వద్ద ఫుడ్ స్టాల్‌ను ఏర్పాటు చేయడం మంచి ఆలోచన. బిర్యానీ, సమోసాలు, చాట్, పానీపూరీ, చైనీస్ ఫుడ్స్ వంటివి విక్రయించడం ద్వారా రోజుకు రూ.8,000 నుంచి రూ.10,000 వరకు సంపాదించవచ్చు.
* పూల విక్రయం
పండుగలలో ముఖ్యంగా పూజల కోసం పూలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పూల దండలు, పుష్పగుచ్ఛాలు, వివిధ రకాల ఆకులను పూజ కోసం విక్రయించడానికి తాత్కాలిక పూల దుకాణాన్ని ఏర్పాటు చేయవచ్చు. మంచి లాభాలను అందుకోవచ్చు.
* బట్టల దుకాణం
పండుగకు వెళ్లేవారు కొత్త బట్టలు కొనడానికి ఇష్టపడతారు. బట్టల దుకాణాన్ని ఓపెన్ చేసి, పండుగ ప్రారంభానికి ముందే వస్తువులను అమ్మడం ప్రారంభించవచ్చు. ఫెస్టివల్ సీజన్ అంతటా మంచి వ్యాపారం జరుగుతుంది.
మార్కెట్‌లో 7-సీటర్ కార్ల తుఫాను, జోరుగా 5 కార్ల సేల్స్, ఒకదాని మైలేజ్ 26 Kmpl కంటే ఎక్కువే!
2024 Tata Safari: 2024 టాటా సఫారీ బుకింగ్స్ ప్రారంభం.. కొత్త వెహికల్ ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే..
* గిఫ్ట్ షాప్
మన పండుగలలో బహుమతులు ఇవ్వడం ఒక ముఖ్యమైన భాగం. రిమోట్-కంట్రోల్ టాయ్స్, కాస్మటిక్స్, పండుగల సమయంలో ప్రజలు మార్పిడి చేసుకోవడానికి గృహాలంకరణ వంటి అనేక రకాల వస్తువులను విక్రయించవచ్చు.
* బొమ్మల దుకాణం
ప్రధాన పండుగలు బొమ్మల దుకాణాలు ఏర్పాటు చేయడానికి అనువైన సమయం. హ్యాండ్ గన్స్, బో అండ్ యారో సెట్స్, చైనీస్ టాయ్స్‌ని రూ.100 నుంచి రూ.400 ధరల శ్రేణిలో అమ్మవచ్చు. ఈ దుకాణం ద్వారా పండుగ సీజన్‌లో రోజుకు సుమారు రూ.20,000 పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
[ad_2]
Source link